Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మహిళల హామీలపై సీఎం చంద్రబాబును నిలదీసిన మాజీ మంత్రి పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ఇస్తామని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చకపోవడంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు పేర్ని నాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కృష్ణా జిల్లా పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళల సున్నా వడ్డీ పథకానికి రూ.5,000 కోట్లు, డ్వాక్రా గ్రూపుల రుణాల కోసం రూ.26,000 కోట్లు వైఎస్ జగన్ కేటాయించారని గుర్తుచేశారు.గతంలో జగన్ అందించిన విధంగా ప్రస్తుతం మహిళలకు ఆర్థిక సాయం ఎందుకు అందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
Tags:#Andhra Pradesh#National#Shorts





